పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. యువ వైద్యురాలిపై లైంగిక దాడి
 

by Suryaa Desk | Wed, May 21, 2025, 07:52 PM

మహిళలు, బాలికలపై జరుగుతున్న దారుణాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా, ఎంతమంది నేరస్తులను కఠినంగా శిక్షించినా.. కామాంధుల ఆలోచనల్లో మార్పు రాకటం లేదు. ఈ అకృత్యాలు పెరగటమే కాదు.. వాటి స్వభావంలోనూ క్రూరత్వం పెరుగుతోంది. సమాజంలో మహిళల పట్ల అవగాహన, గౌరవం లేకుండా కన్నూమిన్నూ కానకుండా దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా.. హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి పేరుతో ఓ వైద్యుడు.. యువ వైద్యురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమెను నమ్మించి మోసం చేశాడు. బంజారాహిల్స్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది.


వివరాల్లోకి వెళితే.. నిలోఫర్ ఆసుపత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్న ఓ యువతికి మహబూబాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్న స్వామి పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. 'నిన్నే పెళ్లి చేసుకుంటా' అని స్వామి ఆ యవ డాక్టర్‌కు నమ్మించాడు. అతడి మాటలు పూర్తిగా నమ్మిన యువ డాక్టర్.. అతడు చెప్పినట్లు చేసింది. ఈ క్రమంలో ఓ రోజు బాధితురాలిని బంజారాహిల్స్‌లోని స్టార్ హోటల్‌కు తీసుకెళ్లాడు. అక్కడ రూం బుక్ చేసి తనలోని కామవాంఛను తీర్చుకున్నాడు. ఇవన్నీ పెళ్లి తర్వాతే అని బాధితురాలు వద్దని వారించినా కామంతో కల్లుమూసుకొని ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తనను పెళ్లి చేసుకోవాలని యువతి ప్రస్తావన తీసుకొచ్చింది.


అయితే ఈ ఏడాది జనవరిలోనే పెళ్లి చేసుకుంటానని నమ్మబలికిన స్వామి.. ఆ తర్వాత మెుహం చాటేశాడు. పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చిన ప్రతిసారీ మాయమాటలతో తప్పించుకునేవాడు. పెళ్లి పేరుతో తనను శారీరకంగా వాడుకొని మోసం చేశాడని గ్రహించిన బాధితురాలు.. బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు స్వామిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు సమాజంలో మహిళల భద్రతపై తీవ్ర ఆందోళనను పెంచుతున్నాయి. ఆడపిల్లలు కొత్త వారితో పరిచయాలు ఏర్పరచుకునేటప్పుడు ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.

Latest News
Israel fighting for rights of Christians: PM Netanyahu Mon, Apr 27, 2026, 10:08 AM
Sensex, Nifty trade higher in early session on global optimism Mon, Apr 27, 2026, 10:02 AM
Heatwave in Rajasthan: Barmer, Jaisalmer record 46 degrees Mon, Apr 27, 2026, 09:59 AM
India, New Zealand set to sign key FTA to double trade, boost ties Mon, Apr 27, 2026, 09:47 AM
Heavy rain alert for western TN, strong winds likely till May 2 Mon, Apr 27, 2026, 09:42 AM