|
|
by Suryaa Desk | Wed, May 21, 2025, 06:21 PM
ఆంధ్రప్రదేశ్‌లో పంట పొలాలు, జనావాసాలపై ఏనుగులు చేస్తున్న దాడులతో జరుగుతున్న ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించే దిశగా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా, కర్ణాటక ప్రభుత్వం అందించిన ఐదు కుంకీ ఏనుగులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్వయంగా స్వీకరించారు. ఈ ఏనుగుల సంరక్షణ బాధ్యతను తానే చూసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. కర్ణాటక విధానసౌధలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖాండ్రే సమక్షంలో ఈ ఐదు కుంకీ ఏనుగులను ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, "కుంకీ ఏనుగులను అత్యంత జాగ్రత్తగా చూసుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి గారికి, అటవీ శాఖ మంత్రి గారికి మాట ఇస్తున్నాను. వాటి సంరక్షణను నేనే స్వయంగా పర్యవేక్షిస్తాను" అని హామీ ఇచ్చారు.
Latest News