|
|
by Suryaa Desk | Wed, May 21, 2025, 06:08 PM
పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలానికి చెందిన దివంగత టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ వెన్నా బాలకోటిరెడ్డి కుటుంబ సభ్యులను మంత్రి లోకేశ్ నేడు ఉండవల్లి నివాసానికి పిలిపించి పరామర్శించారు. వారి సమస్యలను సావధానంగా విన్న మంత్రి, అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.మంత్రి లోకేశ్ ను కలిసిన వెన్నా బాలకోటిరెడ్డి సతీమణి వెన్నా నాగేంద్రమ్మ, ఆయన సోదరుని కుమారులు వెన్నా నరసింహారెడ్డి, వెన్నా రామకృష్ణారెడ్డి తమ గోడును వెళ్లబోసుకున్నారు. బాలకోటిరెడ్డి హత్య జరిగిన తీరును, ప్రస్తుత ఆరోగ్య, ఆర్థిక పరిస్థితులను వారు మంత్రికి వివరించారు. హత్య కేసులో నిందితులు ఇంకా స్వేచ్ఛగా తిరుగుతున్నారని, కేసు విచారణను వేగవంతం చేసి, దోషులకు కఠిన శిక్ష పడేలా చూడాలని వారు లోకేశ్ ను కోరారు. తాము ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఉపాధి హామీ, గృహ నిర్మాణ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, నివాసం ఉంటున్న ఇల్లు కూడా తాకట్టులో ఉందని వారు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.స్పందించిన మంత్రి నారా లోకేశ్, వెన్నా బాలకోటిరెడ్డి కుటుంబానికి జీవితాంతం అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
Latest News