బెంగళూరులో భారీ వర్షాలు
 

by Suryaa Desk | Wed, May 21, 2025, 05:57 PM

బెంగళూరు నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ నేపథ్యంలో, పలు ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే (వర్క్ ఫ్రమ్ హోమ్) వెసులుబాటు కల్పించాలని బెంగళూరు సెంట్రల్ బీజేపీ ఎంపీ పీసీ మోహన్ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే కొన్ని సంస్థలు ఈ దిశగా చర్యలు తీసుకున్నాయి.బెంగళూరులో కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదివారం (మే 18) ఉదయం 8:30 నుంచి సోమవారం (మే 19) ఉదయం 8:30 గంటల మధ్య 24 గంటల వ్యవధిలో నగరంలో 105.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 2011 తర్వాత ఒకే రోజులో ఇంతటి భారీ వర్షపాతం నమోదు కావడం ఇది రెండోసారి అని అధికారులు తెలిపారు. ఈ వర్షాల వల్ల నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి, ట్రాఫిక్ వ్యవస్థ స్తంభించింది.ఈ పరిస్థితుల దృష్ట్యా, బెంగళూరు సెంట్రల్ బీజేపీ ఎంపీ పీసీ మోహన్ ఐటీ కంపెనీలకు కీలక సూచన చేశారు. "బెంగళూరులోని ఇన్ఫోసిస్‌తో సహా అన్ని కంపెనీలు వర్షాల కారణంగా రెండు రోజుల పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించాలి" అని ఎక్స్ వేదికగా కోరారు.

Latest News
How Pakistan's power sector borrowed its way into a deep crisis Wed, Apr 29, 2026, 04:22 PM
Anti-incumbency wave in Bengal, Mamata Banerjee appears 'restless': Adhir Ranjan Chowdhury Wed, Apr 29, 2026, 04:20 PM
Pakistan: Children from underprivileged families continue to face structural barriers Wed, Apr 29, 2026, 04:14 PM
Bihar CM Choudhary announces Rs 8 lakh aid for worker killed in Delhi firing Wed, Apr 29, 2026, 04:04 PM
No hike in petrol, diesel prices: PIB fact-check unit debunks social media post Wed, Apr 29, 2026, 04:03 PM