|
|
by Suryaa Desk | Wed, May 21, 2025, 04:57 PM
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మకర్తల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయ పరిసరాల్లో డ్రోన్లు పనిచేయకుండా నిరోధించే అత్యాధునిక "యాంటీ డ్రోన్ టెక్నాలజీ"ని వినియోగించాలని తీర్మానించింది. మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో పలు ముఖ్యమైన అంశాలపై చర్చించి, ఆమోదముద్ర వేశారు. సమావేశానంతరం ఈవో జె. శ్యామలరావు మీడియాకు వివరాలు వెల్లడించారు.తిరుమల ఆలయ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో, డ్రోన్ల ద్వారా ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ఉండేందుకు ఇజ్రాయెల్‌కు చెందిన యాంటీ డ్రోన్ సాంకేతికతతో పాటు మరికొన్నింటిని పరిశీలించి, అత్యుత్తమమైన దానిని ఎంపిక చేయాలని బోర్డు నిర్ణయించినట్లు ఈవో శ్యామలరావు తెలిపారు.
Latest News