|
|
by Suryaa Desk | Wed, May 21, 2025, 03:34 PM
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తిరుమల కొండలపై ప్రస్తుతం ఉన్న 68.14 శాతం పచ్చదనాన్ని అటవీశాఖ ద్వారా 80 శాతానికి పెంచేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. ఇందుకు ప్రభుత్వ అనుమతి లభించిన వెంటనే దశలవారీగా రూ.4 కోట్లు విడుదల చేయనున్నారు.అలాగే, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, అమరావతి, నారాయణవనం, కపిలతీర్థం, నాగాలాపురం, ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయాల అభివృద్ధి కోసం సమగ్ర బృహత్ ప్రణాళిక (మాస్టర్ ప్లాన్) రూపొందించేందుకు ఆర్కిటెక్ట్‌ల నుంచి సాంకేతిక, ఆర్థిక ప్రతిపాదనలు స్వీకరించాలని నిర్ణయించారు. తుళ్లూరు మండలం అనంతవరంలోని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి రూ.10 కోట్లు కేటాయించేందుకు ఆమోదం తెలిపారు.రాయలసీమ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ప్రస్తుతం ఇస్తున్న రూ.60 కోట్లకు అదనంగా మరో రూ.71 కోట్లు ఆర్థిక సహాయం అందించాలని బోర్డు నిర్ణయించింది.
Latest News