దేశంలో ఎక్కువ శాతం ప్రజలు వేడి ముప్పుకి గురవుతున్నారంటున్న సీఈఈడబ్ల్యూ
 

by Suryaa Desk | Wed, May 21, 2025, 03:23 PM

భారతదేశంలో వేడి తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరుకుంటోందని, దేశంలోని అత్యధిక జనాభా దీని ప్రభావానికి గురవుతోందని ఢిల్లీకి చెందిన ‘శక్తి పర్యావరణం, నీటి మండలి’ (సీఈఈడబ్ల్యూ) మంగళవారం విడుదల చేసిన తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం, దేశంలోని దాదాపు 57 శాతం జిల్లాలు అధికం నుంచి అతి తీవ్రమైన వేడి ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఈ ప్రాంతాల్లో దేశం మొత్తం జనాభాలో 76 శాతం మంది నివసిస్తుండటం గమనార్హం.సీఈఈడబ్ల్యూ అధ్యయనం ప్రకారం, అత్యధిక వేడి ప్రమాదం పొంచి ఉన్న పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ కూడా ఉంది. ఈ జాబితాలో ఢిల్లీ, మహారాష్ట్ర, గోవా, కేరళ, గుజరాత్‌, రాజస్థాన్‌, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాలు ఉన్నాయి. గత దశాబ్ద కాలంలో పగటిపూట కంటే అధిక ఉష్ణోగ్రతల రాత్రుల సంఖ్య వేగంగా పెరిగిందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది.

Latest News
India's new strategic maritime hub takes shape at Great Nicobar Fri, May 01, 2026, 04:18 PM
India-Tanzania bilateral trade crosses $9 billion, set to grow further Fri, May 01, 2026, 04:17 PM
IPL 2026: When and Where to watch CSK vs MI, know all details Fri, May 01, 2026, 04:10 PM
Nitish Kumar vacates Bihar CM residence on Buddha Purnima Fri, May 01, 2026, 04:08 PM
US Navy's blockade of Iran hits China's cheap oil deals: Report Fri, May 01, 2026, 04:06 PM