ఆహారం లేక 14,000 మంది పిల్లలు చనిపోయే అవకాశం ఉందని..యూఎన్ హెచ్చరిక.
 

by Suryaa Desk | Wed, May 21, 2025, 01:47 PM

గాజా పరిస్థితి దయనీయంగా మారింది. తిండి లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. కొద్దిరోజులుగా మానవతా సాయం నిలిచిపోవడంతో ఆహారం, నీళ్లు లభించక విలవిలలాడిపోతున్నారు దీంతో యూఎన్ తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. తక్షణమే ఆహారం అందకపోతే వేలల్లో పిల్లలు చనిపోతారని వార్నింగ్ ఇచ్చింది. ఇజ్రాయెల్-గాజా మధ్య గత రెండేళ్ల నుంచి భీకరమైన యుద్ధం సాగుతోంది. గాజాను పూర్తిగా ఇజ్రాయెల్ నాశనం చేసింది. దీంతో అక్కడ పరిస్థితులు దయనీయంగా తయారయ్యాయి. ప్రజలకు తిండి లేక అల్లాడిపోతున్నారు. ఇక చిన్న పిల్లల పరిస్థితి మరి ఘోరంగా తయారైంది. పోషకాహార లోపంతో పిల్లలు కృషించి పోతున్నారు. యుద్ధం కారణంగా స్వచ్చంధ సంస్థలు అందించే ఆహారం నిలిచిపోవడంతో గాజాలో దుర్భరమైన పరిస్థితులు నెలకొన్నాయి. సరైన వైద్యం అందక కూడా నీరసించి పోయారు. దీంతో తాజాగా ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. 48 గంటల్లో 14,000 మంది పిల్లలు చనిపోయే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చింది. సోమవారం ఐదు ట్రక్కుల ఆహారం మాత్రమే గాజాలోకి ప్రవేశించాయని యూఎన్ తెలిపింది. గాజాలో దారుణమైన పరిస్థితుల నేపథ్యంలో ఆదివారం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.. ఆహారం పంపిణీకి అనుమతి ఇచ్చారు. అయితే కొద్ది ఆహారమే చేరడంతో మరింత మంది ఆకలితో అలమటిస్తున్నారు. ఈ నేపథ్యంలో 48 గంటల్లో ఆహారం చేరకపోతే 14 వేల మంది చనిపోవచ్చని యూఎన్ హెచ్చరించింది. దాదాపు 11 వారాల పాటు గాజాను ఇజ్రాయెల్ పూర్తి దిగ్బంధించింది. దీంతో పాలస్తీనియన్లకు ఆహారం లభించలేదు. అయితే అమెరికా, కెనడా, ఫ్రాన్స్, యూకే వంటి మిత్ర దేశాల ఒత్తిడితో ఆదివారం స్వల్పంగా నెతన్యాహు అనుమతి ఇచ్చారు. మిత్ర దేశాలు తీవ్రంగా విమర్శించడంతో నెతన్యాహు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఓ వైపు నెతన్యాహు స్వల్ప అనుమతి ఇచ్చినా.. ఇంకోవైపు భీకరమైన దాడులు సాగిస్తూనే ఉన్నారు. ఈ వారంలో జరిగిన దాడుల్లో వందల కొద్ది పాలస్తీనియర్లు చనిపోయారు. గాజాను పూర్తిగా స్వాధీనం చేసుకుంటామని ఇప్పటికే నెతన్యాహు ప్రకటించారు. ఆ దిశగానే ఐడీఎఫ్ సాగుతోంది.

Latest News
Delhi: Rs 2 lakh online car fraud case solved, one arrested Sat, May 02, 2026, 12:30 PM
Hearts beating faster for many in Kerala, with D–Day just 48 hours away Sat, May 02, 2026, 12:16 PM
CBI secures extradition of fugitive Kamlesh Parekh from UAE in major bank fraud case Sat, May 02, 2026, 12:14 PM
Govt tests nationwide mobile emergency alert system to safeguard citizens Sat, May 02, 2026, 12:02 PM
Torch rally across country reflects women's anger, says UP Dy CM; backs protest over Reservation Bill row Sat, May 02, 2026, 12:01 PM