|
|
by Suryaa Desk | Wed, May 21, 2025, 01:02 PM
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులపై భద్రతా బలగాలు భారీ ఆపరేషన్ చేపట్టాయి. నారాయణపూర్ జిల్లా మాధ్ అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం ప్రారంభమైన ఎదురుకాల్పులు తీవ్రంగా చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు 28మంది మావోయిస్టులు మృతి చెందారు.
ఈ ఆపరేషన్‌లో ఒక జవాన్ వీరమరణం పొందగా, మరో ఐదుగురు భద్రతా సిబ్బంది గాయాలపాలయ్యారు. వారి పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
భారీ సంఖ్యలో మావోయిస్టులు మాధ్ ప్రాంతంలో తలదాచుకున్నారని స్పష్టమైన సమాచారం ఆధారంగా భద్రతా బలగాలు ముందస్తు చర్యలకు దిగాయి. ఈ దాడిలో బీజాపూర్, నారాయణపూర్, దంతెవాడ జిల్లాలకు చెందిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ (DRG) బలగాలు చురుకుగా పాల్గొన్నాయి.
పూర్తి ఆపరేషన్ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇదివరకు ఇదే ప్రాంతంలో పలు మార్లు ఘర్షణలు చోటుచేసుకున్నప్పటికీ, ఈ సారి భారీగా మావోయిస్టులు హతమవడం గమనార్హం.