|
|
by Suryaa Desk | Wed, May 21, 2025, 12:15 PM
ఏపీ ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయమైన నిధి భవన్లో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. ఉద్యోగులంతా విధుల్లో ఉండగానే భవనం 2వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. సెంట్రల్ ఏసీలో షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. కంప్యూటర్లు, దస్త్రాలు కాలిపోయి ఉంటాయని అధికారులు అంటున్నారు. కంప్యూటర్లు కాలిపోవడం వల్ల లావాదేవీలకు సంబంధించిన పూర్తి సమాచారం మంటల్లో కాలిపోయి ఉండవచ్చని ఉద్యోగులు భావిస్తున్నారు.
Latest News