|
|
by Suryaa Desk | Wed, May 21, 2025, 11:56 AM
ఒకే సబ్బును కుటుంబ సభ్యులంతా వాడటం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇండియన్ జర్నల్ ఆఫ్ డెంటల్ రీసెర్చ్ ప్రకారం, సబ్బులో సాల్మొనెల్లా, స్టాఫ్లోకొక్కస్, నోరోవైరస్ వంటి హానికర సూక్ష్మజీవులు ఉండే అవకాశముంది. ఇవి చర్మంపై గాయాల ద్వారా శరీరంలోకి ప్రవేశించి క్రాస్-ఇన్‌ఫెక్షన్‌కు దారితీయవచ్చు. కాబట్టి ఒకే సబ్బును ఇంట్లో వారంతా వాడటం కన్నా.. తమకంటూ ప్రత్యేకమైన సబ్బు వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.
Latest News