|
|
by Suryaa Desk | Wed, May 21, 2025, 11:55 AM
ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తూ.గో జిల్లా కొవ్వూరు, శ్రీకాకుళం జిల్లా పలాస, విశాఖలోని మాధవధార, మురళీనగర్, కంచరపాలెం ప్రాంతాల్లో వాన పడుతోంది. భారీ వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Latest News