|
|
by Suryaa Desk | Tue, May 20, 2025, 04:01 PM
IPLలో భాగంగా హైదరాబాద్, లక్నో జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మతో గొడవ పడినందుకు దిగ్వేష్ రతి కఠినమైన శిక్షను ఎదుర్కొన్నాడు. దిగ్వేష్ రతిపై బీసీసీఐ ఒక మ్యాచ్ నిషేధం విధించింది. GTతో నెక్స్ట్ ఆడే మ్యాచ్‌లో అతనిపై నిషేధం విధించారు. దీనితో పాటు దిగ్వేష్ రతి మ్యాచ్ ఫీజులో 50 శాతం కూడా తగ్గించారు. అభిషేక్ శర్మ తన మ్యాచ్ ఫీజులో 25 శాతం కూడా కోల్పోవాల్సి వచ్చింది.వికెట్లు తీసిన అనంతరం హద్దులు దాటి సంబరాలు చేసుకున్నందుకుగాను ఇప్పటికే దిగ్వేశ్ రెండుసార్లు జరిమానాకు గురయ్యాడు. ఈ సీజన్‌లో మూడోసారి ఐపీఎల్ (IPL) ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకుగాను దిగ్వేశ్ రాఠీపై బీసీసీఐ (BCCI) చర్యలు తీసుకుంది. మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించడంతో పాటు, లఖ్‌నవూ సూపర్ కింగ్స్.. గుజరాత్ టైటాన్స్‌తో మే 22న అహ్మదాబాద్ వేదికగా ఆడనున్న తదుపరి మ్యాచ్ నుంచి సస్పెండ్ చేసింది. ఈ సీజన్‌లో దిగ్వేశ్ ఖాతాలో ప్రస్తుతం అయిదు డీ మెరిట్ పాయింట్లున్నాయి. అలాగే సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ అభిషేక్ శర్మపై కూడా బీసీసీఐ చర్యలు తీసుకుంది. దిగ్వేశ్‌తో వివాదం నేపథ్యంలో అభిషేక్ మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించడంతోపాటు అతడి ఖాతాలో ఒక డీ మెరిట్ పాయింట్‌ను వేసింది.
Latest News