|
|
by Suryaa Desk | Tue, May 20, 2025, 11:25 AM
ఎన్నికల సందర్భంగా కూటమి పార్టీలు ఇచ్చిన 'ఆడబిడ్డ నిధి' హామీకి మంగళం పాడుతున్నాయని శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఇటీవల ఓ సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఆడబిడ్డ నిధిని పీ4లో పెట్టాను అనడం దుర్మార్గం కాదా అని ప్రశ్నించారు. అంటే ఎన్నికలకు ముందు మహిళలను ఆడబిడ్డ నిధి పథకం అంటూ నమ్మించి, తీరా అధికారంలోకి వచ్చిన తరువాత వారిని పచ్చిగా మోసం చేయాలనే దుర్మర్గపు ఆలోచనతో చంద్రబాబు ఉన్నారని ధ్వజమెత్తారు. అయన మాట్లాడుతూ.... ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు ఆడబిడ్డ నిధి పేరుతో పద్దెనిమిది ఏళ్ళ నుంచి 59 ఏళ్ళ లోపు ఉన్న మహిళలకు నెలకు రూ.1500 ఇస్తానని హామీ ఇచ్చాయి. మూడు రోజుల కిందట చంద్రబాబు మాట్లాడుతూ ఈ పథకాన్ని పీ4లో పెట్టాను, దానిలో చూస్తాను అని చెప్పారు. పీ4కి, ఆడబిడ్డ నిధికి సంబంధం ఏమిటీ? ఏడాదికి రూ.18000 ఇస్తామన్నారు. ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావోస్తోంది. రాష్ట్రంలోని దాదాపు అర్హులైన కోటి మందికి పైగా మహిళలకు ఎప్పుడు ఆడబిడ్డ నిధిని ఇస్తారు? బీజేపీ, జనసేనలు కూడా చంద్రబాబు మాటలను సమర్థిస్తున్నారా? ఆడబిడ్డ నిధిని ఎప్పుడు ఇస్తారో ప్రకటించాలని ప్రతిపక్షంగా వైయస్ఆర్‌సీపీ తరుఫున డిమాండ్ చేసారు.
Latest News