|
|
by Suryaa Desk | Tue, May 20, 2025, 11:10 AM
ఎన్టీఆర్ బేబీ కిట్ల పంపిణీ పథకాన్ని పునరుద్ధరిస్తూ కూటమి ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం కోసం రూ.51.14 కోట్లు మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది. ఒక్కో కిట్‌కు రూ.1,410 వరకు ఖర్చు అవుతుందని వెల్లడించింది. ఎన్టీఆర్ బేబీ కిట్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఏపీలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన తల్లులకు అందించే ఎన్టీఆర్ బేబీకిట్ల పథకాన్ని పునః ప్రారంభిస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారికంగా ప్రకటింది. వీటిని త్వరలోనే అధికారికంగా ప్రకటించి రిలీజ్ చేస్తారు.ఇకపోతే కూటమి ప్రభుత్వం బేబీ కిట్‌లో రూ.1410వేలు విలువైన వస్తువులను అందజేస్తారు. దోమతెర, దుప్పటి, స్లీపింగ్ బెట్, యాంటీసెప్టిక్ లోషన్‌తో పాటుగా నాప్‌కిన్, డైపర్లు, షాంపూ వంటి 11 రకాల సామాగ్రి ఉంటుంది. ఈ కిట్‌లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన తల్లులకు, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే సమయంలో ఉచితంగా అందజేస్తారు.
Latest News