ప్రభుత్వ లాంఛనాలతో ఉగ్రవాది అంత్యక్రియలు
 

by Suryaa Desk | Mon, May 19, 2025, 08:47 PM

పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందని భారత్ పదే పదే చెబుతున్నా ఎవరూ నమ్మట్లేదు. దాయాది దేశం కూడా ఎప్పుడూ తమకు ఉగ్రవాదులు అంటే ఎవరో కూడా తెలియదని, తమకు వారితో ఎలాంటి సంబంధాలు లేవని వివరించింది. కానీ ప్రతీసారి ఉగ్రవాదులకు సాయం చేస్తూ.. అడ్డంగా దొరికిపోతూ నవ్వుల పాలవుతోంది. ఆదివారం రోజే లష్కరే తోయిబా గ్రూపునకు చెందిన ఉగ్రవాది అబు సైఫుల్లా హతమవ్వగా.. అదే రోజు అంత్యక్రియలు నిర్వహించారు. అయితే చనిపోయింది ఉగ్రవాదే అయినప్పటికీ.. పాకిస్థాన్ మాత్రం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరింపించింది. అతడి మృతదేహంపై పాక్ జాతీయ జెండాను కూడా కప్పింది. అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతుండగా.. పాక్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తుందని ఈ వీడియో చూస్తుంటేనే అర్థం అవుతుందంటూ అనేక మంది కామెంట్లు చేస్తున్నారు.


భారత్‌లో అనేక ఉగ్రదాడులకు తెగబడిన లష్కరే తోయిబా టాప్ ఉగ్రవాది రజావుల్లా నిజామనీ అలియాస్ అబు సైఫుల్లా ఆదివారం రోజు హతం అయ్యాడు. పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్సులో ఉండే ఈయనకు.. ఆ దేశ ప్రభుత్వ భద్రత ఉంది. అయితే మట్లీలోని తన నివాసం నుంచి ఆదివారం రోజు మధ్యాహ్నం బయటకు వెళ్లాడు. అక్కడే ఓ చౌరస్తాకు చేరుకున్న అతడిపై గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి దాడులకు పాల్పడ్డారు. అనేక రౌండ్ల కాల్లుపు జరిపి మరీ హత్య చేశారు. ఈ విషయాన్ని నేరుగా అక్కడి అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే ఇతడు భారత్‌లో జరిగిన అనేక ఉగ్రదాడులకు సూత్రధారిగా ఉన్నాడు.


నాగ్‌పూర్‌లోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రధాన కార్యాలయంపై 2006లో జరిగిన దాడి వెనుక కూడా ఇతడి హస్తం ఉంది. అంతేకాదు 2005లో బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్‌పై జరిగిన ఉగ్రదాడి, 2001లో రాంపూర్‌లోని సీఆర్పీఎఫ్ శిబిరంపై జరిగిన ఉగ్రదాడి వెనకున్న సూత్రధారి కూడా ఈ ముష్కరుడే. ఇన్ని దాడుల్లో పాత్ర వహించిన ఇతడు తాజాగా హత్యకు గురి కావడం గమనార్హం. అందులోనూ ప్రభుత్వ భద్రత ఉండగా.. నడిరోడ్డుపైనే కాల్చి చంపారు. అయితే ఉగ్రవాది మృతిపై పాకిస్థాన్ సర్కారు తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఆదివారం రోజే ఇతడి అంత్యక్రియలు నిర్వహించారు.


ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అందులోనే ఉగ్రవాది అబు సైఫుల్లా అంత్యక్రియలను పాకిస్థాన్ సర్కారు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అతడి మృతదేహంపై పాక్ జాతీయ జెండాను కూడా ఉంచారు. ఇవన్నీ చూసిన నెటిజెన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాక్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తుందని చెప్పడానికి ఈ వీడియోనే నిదర్శనం అని.. ముష్కరులకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరి ఇవన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తుందో కామెంట్ల రూపంలో వెల్లడించేయండి.


Latest News
Deaths after C-Sec complications in Kota: Doctor and two nursing staff suspended Sat, May 09, 2026, 04:12 PM
Bengal saved from turning to 'Western Bangladesh': Minister Agnimitra Paul Sat, May 09, 2026, 04:11 PM
'Akhilesh Yadav has become tourist these days': BJP's Shahnawaz Hussain targets SP chief over Bengal visit Sat, May 09, 2026, 04:10 PM
Lankan newspapers carry front-page tributes for Pahalgam terror attack victims, honour 'Op Sindoor' Sat, May 09, 2026, 04:08 PM
American passengers aboard hantavirus-hit cruise ship to quarantine in Nebraska Sat, May 09, 2026, 04:05 PM