|
|
by Suryaa Desk | Sun, May 18, 2025, 11:34 AM
ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో వ్యవసాయశాఖలోనూ బదిలీలకు చర్యలు మొదలయ్యాయి. జిల్లా, జోనల్, స్టేట్ లెవల్ పోస్టులను ఉటంకిస్తూ, ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన శాఖాపరమైన మార్గదర్శకాలను డైరెక్టర్ డిల్లీరావు శనివారం జారీ చేశారు. బదిలీల్లో ఏవైనా వ్యత్యాసాలు జరిగితే సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. 2025 మే 31నాటికి ఒకే స్థానంలో ఐదేళ్లు పూర్తి చేసిన ఉద్యోగుల జాబితాను కేడర్ వారీగా పూర్వ జిల్లాల వ్యవసాయ అధికారులందరూ ఈనెల 19లోపు ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా డైరెక్టరేట్‌కు అందించాలని ఆదేశించారు.
Latest News