షాకిచ్చిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే
 

by Suryaa Desk | Sat, May 17, 2025, 11:46 PM

భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా పండగలు, శుభకార్యాలు, ఇతర వేడుకల సమయాల్లో బంగారు ఆభరణాలు కొనేందుకు మహిళలు ఆసక్తి చూపిస్తుంటారు. ఇది వారి అందాన్ని మరింత పెంచుతుందని చెప్పొచ్చు. బంగారం అనేది కేవలం అలంకరణగానే కాకుండా పెట్టుబడి సాధనంగానూ పనిచేస్తుంది. అంతలా బంగారం అనేది భారతీయ సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడి ఉంటుంది. ఇక బంగారం ధరలు అనేవి స్థిరంగా ఉండవు. ఎప్పటికప్పుడు మారుతుంటాయి. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగానే దేశీయంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తుంటాయి. ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్లో, దేశీయంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.


ఇంటర్నేషనల్ మార్కెట్లో చూస్తే ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుక (31.10 గ్రాములు) 3200 డాలర్ల స్థాయిలో కదలాడుతోంది. కిందటి రోజు ఇది 3230 డాలర్ల వద్ద ఉంది. సిల్వర్ రేటు 32.30 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇదే సమయంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 85.640 వద్ద ఉంది. అమెరికా- చైనా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం వల్ల ఇటీవల బంగారానికి డిమాండ్ తగ్గి రేట్లు దిగొచ్చాయన్న సంగతి తెలిసిందే.


దేశీయంగా బంగారం ధరల్ని మనం ఇప్పుడు గమనిద్దాం. హైదరాబాద్ నగరంలో చూస్తే 22 క్యారెట్స్ పసిడి ధర ఒక్కరోజులోనే రూ. 1100 పెరిగి తులం రూ. 87,200 వద్ద ఉంది. దీనికి ముందు వరుసగా రూ. 1950; రూ. 500 చొప్పున తగ్గింది. దానికి ముందు రూ. 1000 పెరగ్గా.. అంతకుముందైతే ఏకంగా రూ. 2950 తగ్గుముఖం పట్టింది. కానీ ఇప్పుడు సడెన్ షాకిస్తూ ఒక్కసారిగా పెరిగింది. మరోవైపు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర కూడా రూ. 1200 పెరగడంతో ఇప్పుడు 10 గ్రాములకు రూ. 95,130 వద్ద ఉంది.


ఇక వెండి రేట్లు చూస్తే స్థిరంగానే ఉన్నాయి. దీనికి ముందు వరుసగా రూ. 1000 చొప్పున 3 రోజులు తగ్గి ప్రస్తుతం స్థిరంగానే ఉంది. హైదరాబాద్ నగరంలో కిలో వెండి రేటు రూ. 1.08 లక్షల వద్ద ఉంది. ఇక బంగారం, వెండి ధరలు అన్ని ప్రాంతాల్లో ఒకేలా ఉండవు. ప్రాంతాల్ని బట్టి.. స్థానిక పన్ను రేట్లను బట్టి బంగారం ధరల్లో మార్పు ఉంటుంది. ఈ కారణంతోనే హైదరాబాద్ నగరంలో బంగారం ధర.. ఢిల్లీతో పోలిస్తే కాస్త తక్కువగా ఉంటుంది. అదే వెండి రేట్ల విషయానికి వస్తే హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉంటాయి. ఇక బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే ముందు.. హాల్ మార్క్ చూసి కొనుగోలు చేయడం మంచిది.

Latest News
Foreign maids under South Korean govt's pilot project overworked, underpaid: Survey Sat, Jan 17, 2026, 04:00 PM
Singur: A story of political gains and administrative failures where residents still wait for 'manna' Sat, Jan 17, 2026, 03:58 PM
Indian households add Rs 117 lakh crore in 2025 as gold rally boosts wealth Sat, Jan 17, 2026, 03:28 PM
Not regular or institutionalised BRICS activity: MEA on Cape Town naval exercise Sat, Jan 17, 2026, 03:22 PM
CM Yadav condemns Congress MLA Baraiya's remarks on SC/ST women; says LoP Gandhi should take action Sat, Jan 17, 2026, 03:20 PM