పౌరసత్వం కావాలంటే గేమ్ ఆడాల్సిందే..ట్రంప్
 

by Suryaa Desk | Sat, May 17, 2025, 08:04 PM

మీరు స్క్విడ్ గేమ్ సిరీస్ చూశారా.. అమెరికాలో ఇప్పుడు అలాంటి కొత్త డ్రామా ఒకటి మొదలైంది. అమెరికా పౌరసత్వం పొందాలని చూస్తున్న వలసదారులతో ఒక రియాలిటీ షో నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నారట. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఈ విషయాన్ని ధృవీకరించింది. "ఇది కేవలం పరిశీలన దశలో ఉన్న ప్రతిపాదన మాత్రమే. ఇంకా దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదు. కానీ, వలసదారులకు పౌరసత్వం ఇచ్చే విధానాన్ని మార్చడానికి మేము ప్రయత్నిస్తున్నాము" అని DHS అధికారులు తెలిపారు. ఈ రియాలిటీ షోలో వలసదారులు అమెరికా పట్ల తమ దేశభక్తిని నిరూపించుకోవాల్సి ఉంటుందట. గోల్డ్ రష్, కార్ అసెంబ్లీ వంటి వివిధ రకాల టాస్క్‌లుంటాయి.. ఎల్లిస్ ఐలాండ్‌లో ప్రారంభమయ్యే ఈ షోలో ప్రతి ఎపిసోడ్‌లో ఒకరిని ఎలిమినేట్ చేస్తారట. చివరకు విజయం సాధించిన వారికి అమెరికా పౌరసత్వం లభిస్తుందట. అయితే, ఈ ఆలోచనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ఇది వలసదారులను అవమానించేలా ఉందని విమర్శిస్తుంటే, మరికొందరు ఇది అమెరికా పౌరసత్వం పొందడానికి ఒక వినూత్నమైన మార్గమని అంటున్నారు.

Latest News
Iran to execute 26-year-old protester; family given just 10 minutes for final goodbye Wed, Jan 14, 2026, 03:22 PM
US launches more foreign strikes in Trump's first year than during Biden presidency: Survey Wed, Jan 14, 2026, 03:07 PM
2nd ODI: Nitish comes in for India as NZ opt to bowl first; Lennox handed debut Wed, Jan 14, 2026, 02:55 PM
Pakistan to host Australia for 3 T20Is from Jan 29 ahead of T20 WC Wed, Jan 14, 2026, 02:51 PM
MP 'honour killing': Man kills daughter for eloping with relative Wed, Jan 14, 2026, 02:45 PM