|
|
by Suryaa Desk | Sat, May 17, 2025, 07:39 PM
అమెరికాలో వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అక్కడే ఉంటున్న భారతీయుల కోసం భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. అనుమతించిన సమయం కంటే ఎక్కువ కాలం అమెరికాలో ఉంటే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు రాయబార కార్యాలయం తన అధికారిక 'ఎక్స్' ఖాతాలో వివరాలను పోస్ట్ చేసింది.పర్యాటక వీసా, విద్యార్థి వీసా, పని వీసాల వంటి వివిధ రకాల వీసాలపై అమెరికాలో నివసిస్తున్న భారతీయులను ఉద్దేశించి ఈ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఒకవేళ ఎవరైనా వీసా నిబంధనలు ఉల్లంఘిస్తే, వారిని దేశం నుంచి బలవంతంగా పంపించివేయడమే కాకుండా, భవిష్యత్తులో అమెరికాకు ప్రయాణించకుండా శాశ్వతంగా నిషేధం విధించే అవకాశం ఉందని రాయబార కార్యాలయం తెలిపింది.ఇలాంటి నిషేధం పడితే, అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించాలన్నా, ఉద్యోగ, వ్యాపార అవకాశాలు పొందాలన్నా తీవ్రమైన అడ్డంకులు ఎదురవుతాయని పేర్కొంది. అనుకోని పరిస్థితుల వల్ల వీసా గడువు ముగిశాక కూడా దేశం విడిచి వెళ్లలేని పరిస్థితి వస్తే, చట్టపరమైన చిక్కుల నుంచి తప్పించుకోవడానికి వెంటనే యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ అధికారులను సంప్రదించాలని సూచించింది.
Latest News