|
|
by Suryaa Desk | Sat, May 17, 2025, 05:44 PM
ఏపీ వైద్యరోగ్య శాఖ మంత్రి, బీజేపీ నేత సత్య కుమార్‌ను నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్ బెడద వేధిస్తోంది. సత్యకాలం పేరుతో ఎఫ్‌బీ అకౌంట్‌లో అసభ్య పోస్టింగ్‌లు ఉండటంతో మంత్రి కార్యాలయ సిబ్బంది అప్రమత్తమయ్యారు. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారించగా ప్రస్తుతం ఆ అకౌంట్ ఇన్ యాక్టివ్‌గా ఉన్నట్లు గుర్తించారు.మంత్రి సత్యకుమార్ పేరుతో కొంత మంది ఫేస్‌బుక్ అకౌంట్‌ను క్రియేట్ చేశారు. ఈ అకౌంట్‌లో గత కొంత కాలంగా బీజేపీకి సంబంధించిన, మంత్రి పాల్గొన్న కార్యక్రమాలకు సంబంధించిన పోస్టింగ్‌లు పెడుతూ వచ్చారు. అయితే ఇప్పుడు మాత్రం అసభ్యకరమైన ఓ ఫోటోను ఆ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. దీన్ని గుర్తించిన మంత్రి కార్యాలయం వెంటనే అలెర్ట్ అయ్యింది. ఈ అకౌంట్‌పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ అకౌంట్‌ను అప్పర్ తిరుపతి నుంచి రన్ చేస్తున్నట్లు అకౌంట్లో పేర్కొన్నారు. ఒక ఫోన్ నెంబర్‌ను కూడా అకౌంట్‌లో ఇవ్వడం జరిగింది. అకౌంట్ విషయంపై మంత్రి కార్యాలయానికి సమాచారం వెళ్లగా.. వెంటనే రీచెక్ చేసుకున్న సిబ్బంది.. అకౌంట్‌పై అప్పటికే ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
Latest News