పాకిస్థాన్ కుట్రలని ప్రపంచానికి చెప్పడానికి భారత్ నుండి బృందం నియామకం
 

by Suryaa Desk | Sat, May 17, 2025, 03:39 PM

ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ వైఖరిని ప్రపంచ దేశాల దృష్టికి తీసుకెళ్లేందుకు భారత ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా, వివిధ దేశాలకు పార్లమెంటు సభ్యులతో కూడిన ప్రతినిధి బృందాలను పంపాలని నిర్ణయించింది. ఈ బృందాలు పాకిస్థాన్ ఉగ్ర కుట్రలను, వాటిని ఎదుర్కోవడానికి భారత్ తీసుకుంటున్న చర్యలను అంతర్జాతీయ సమాజానికి వివరించనున్నాయి.పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఏడు అఖిలపక్ష ప్రతినిధి బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలకు నాయకత్వం వహించే ఏడుగురు పార్లమెంటు సభ్యుల పేర్లను ఈరోజు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్‌తో పాటు, రవిశంకర్ ప్రసాద్ (బీజేపీ), బైజయంత్ పాండా (బీజేపీ), సంజయ్ కుమార్ ఝా (జేడీయూ), కనిమొళి (డీఎంకే), సుప్రియా సూలే (ఎన్సీపీ - ఎస్పీ), శ్రీకాంత్ షిండే (శివసేన) ఈ జాబితాలో ఉన్నారు.ఈ ఎంపీల నేతృత్వంలోని ఏడు బృందాలు, మే 22న విదేశీ పర్యటనకు బయలుదేరి, పది రోజుల వ్యవధిలో ఐదు దేశాలను సందర్శించనున్నాయి. జూన్ మొదటి వారంలో ఈ బృందాలు తిరిగి వస్తాయని సమాచారం. ఈ పర్యటనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం విపక్షాలతో సంప్రదింపులు జరిపిన అనంతరమే సభ్యులను ఎంపిక చేసింది.

Latest News
Paris FC eliminate holders PSG from French Cup Tue, Jan 13, 2026, 11:31 AM
Women and elderly more likely to be vaccine-hesitant, says study Tue, Jan 13, 2026, 11:30 AM
Hiring surges across India as AI-linked jobs rise exponentially Tue, Jan 13, 2026, 11:27 AM
RBI endorsement proves Assam's strong fiscal health: CM Sarma Tue, Jan 13, 2026, 11:23 AM
India, not Pakistan, is US long-term strategic partner: Lawmakers Tue, Jan 13, 2026, 11:22 AM