|
|
by Suryaa Desk | Sat, May 17, 2025, 03:34 PM
ఉరవకొండ మండలంలోని పెన్నహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవానికి అన్నివిధాలా ఏర్పాట్లు పూర్తి చేసినట్టు సమాచారం. రథోత్సవం సందర్బంగా ఉదయం నుంచే భక్తులు స్వామి వారి దర్శనానికి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అలాగే పక్క రాష్ట్రాలు అయిన కర్ణాటక మరియు తెలంగాణ నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొనడానికి పెన్నహోబిలం చేరుకున్నారు.
ఈ రోజు ఉదయం నుంచే నరసింహ స్వామిని వివిధ రకాల పూలతో ప్రత్యేకంగా అలంకరించి, భక్తులకు అందించారు. సాయంత్రం సమయంలో, ఉత్సవ మూర్తులను రథంపై కోలువుదీర్చి, అనేక పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకువెళ్లడం జరుగుతుంది.