|
|
by Suryaa Desk | Sat, May 17, 2025, 02:53 PM
బ్రహ్మోస్ లాంటి శక్తివంతమైన క్షిపణి చైనా, పాకిస్థాన్ వద్ద లేదని అమెరికాకు చెందిన యుద్ధ రంగ నిపుణుడు, రిటైర్డ్ కల్నల్ జాన్ స్పెన్సర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతంతో భారత్ ఎంత శక్తివంతమైనదో ప్రపంచ దేశాలకు నిరూపితమైందన్నారు. ఈ క్రమంలో జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడేకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జాన్ స్పెన్సర్.. భారత్ ఆయుధ సంపత్తిని కొనియాడారు. చైనా, పాకిస్థాన్ రక్షణ వ్యవస్థలో భారత్‌లో ఉన్న బ్రహ్మోస్‌తో సరిపోల్చే క్షిపణులు కానీ, ఆయుధ సామాగ్రి కానీ లేవని స్పష్టం చేశారు.పాకిస్థాన్‌తో జరిపిన యుద్ధంతో భారత్ యుద్ధ నైపుణ్యంలో తిరుగులేదని నిరూపించుకుందని ఆయన అన్నారు. అటు డిఫెన్స్, ఇటు ఎఫెన్స్ అయినా భారత్ శక్తి అమోఘమని ఆయన కొనియాడారు.
Latest News