|
|
by Suryaa Desk | Sat, May 17, 2025, 01:58 PM
అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరులో మద్యం సేవించి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న పలువురు ఆకతాయిలకు జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి ప్రవీణ్‌కుమార్ శిక్ష వేసి వెంటనే అమలు చేయించే విధంగా వినూత్న తీర్పును ఇచ్చారు. మండపేట టౌన్‌లో గురువారం రాత్రి మద్యం సేవించి అల్లరి చేస్తున్న పదిమంది యువకులను మండపేట టౌన్ ఎస్‌ఐ చంటి అరెస్టు చేశారు. వీరిని శుక్రవారం ఆలమూరు కోర్టులో హాజరుపరచగా, ఒక్కొక్కరికీ రూ.100 జరిమానాతోపాటు వారితో పరిసరాలను పరిశుభ్రం చేయించాలని న్యాయమూర్తి ప్రవీణ్‌కుమార్ తీర్పు చెప్పారు. దీంతో పోలీసులు వారికి చీపుర్లు ఇచ్చి, కోర్టుకు పక్కనే ఉన్న సబ్‌ట్రెజరీ కార్యాలయాన్ని శుభ్రం చేయించారు. శిక్షను తక్షణం అమలు చేయించడంతో అంతా ఆసక్తిగా తిలకించారు.
Latest News