|
|
by Suryaa Desk | Sat, May 17, 2025, 01:26 PM
సోమందేపల్లి మండలంలోని నాగినాయనిచెరువు గ్రామంలో పారిశుధ్య పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. గుడికి వెళ్లే ప్రధాన రహదారి బురదతో నిండిపోయి, గమనించరానంత స్థితిలో ఉంది. ఈ దారిని శుభ్రపరచాలని, రోడ్డును సరిచేయాలని గ్రామస్థులు అనేకసార్లు అధికారులకు వినతులు పెట్టినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి పల్లెలో పండుగ వాతావరణం సృష్టించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినా కూడా నాగినాయనిచెరువు పంచాయితీ అధికారులు గ్రామాన్ని పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గ్రామ అభివృద్ధిపై సంబంధిత శాఖలు జోక్యం చేసుకుని తక్షణమే చర్యలు తీసుకోవాలన్నది ప్రజల డిమాండ్.