|
|
by Suryaa Desk | Sat, May 17, 2025, 01:21 PM
గుంటూరులో ఆపరేషన్ సిందూర్ సైనికులకు మద్దతుగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మేయర్ కోవెలమూడి రవీంద్ర, ఎమ్మెల్సీ ఆలపాటి రాజా, ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, రామాంజనేయులు, ఏపీఐడీసీ ఛైర్మన్ డేగల ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ ర్యాలీకి భారీగా ప్రజలు హాజరయ్యారు. జాతీయ జెండాలతో నగరవీధులలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. పహల్గాంలో ఉగ్రవాదుల దాడి అత్యంత దుర్మార్గమన్నారు. ఆపరేషన్ సింధూర్‌తో ఉగ్రవాదులను అంతం చేశామని తెలిపారు. ఆపరేషన్ సింధూర్‌లో పాల్గొన్న సైన్యానికి హాట్సాఫ్ తెలియజేశారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళీనాయక్ త్యాగాన్ని దేశ ప్రజలు మర్చిపోరన్నారు. ఎన్డీఏ ప్రభుత్వానికి దేశ రక్షణే మొదటి ప్రాధాన్యమని కేంద్రమంత్రి చెప్పుకొచ్చారు.
Latest News