మరో రాకెట్ ప్రయోగానికి శ్రీకారం చుట్టిన శ్రీహరికోట
 

by Suryaa Desk | Sat, May 17, 2025, 12:58 PM

శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం షార్‌ వేదికగా ఆదివారం ఉదయం 5:59 గంటలకు పీఎస్ఎల్వీ-సీ61 రాకెట్‌ ద్వారా ఈవోఎస్‌-09 (రీశాట్‌-1బీ) ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపనుంది. ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ శనివారం ఉదయం 7:59 గంటలకు ప్రారంభమైంది. 22 గంటలపాటు కొనసాగే ఈ కౌంట్‌డౌన్‌ ముగిసిన వెంటనే షార్‌లోని ప్రథమ ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ-సీ61 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్తుంది. నాలుగు దశల అనుసంధాన పనులు పూర్తి చేసుకుని ప్రయోగ వేదికపైనున్న పీఎస్ఎల్వీ-సీ61 రాకెట్‌కు శాస్త్రవేత్తలు శుక్రవారం తుది పరీక్షలు నిర్వహించారు. ఇక, పీఎస్ఎల్వీ-సీ61 రాకెట్‌ నమూనాను ఇస్రో చైర్మన్‌ నారాయణన్‌... శ్రీవారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే, సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ పరమేశ్వరిని నారాయణన్‌ శాస్త్రవేత్తలతో కలిసి దర్శించుకున్నారు. పీఎస్ఎల్వీ-సీ61 ప్రయోగం విజయవంతం కావాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

Latest News
IANS Year Ender 2025: A year of strains, signals and slow repair for India–US partnership Wed, Dec 31, 2025, 04:47 PM
BJP ally TMP urges Centre to enact anti-racial law to protect Northeast people Wed, Dec 31, 2025, 04:46 PM
Kerala: CPI calls for course correction after local poll setback Wed, Dec 31, 2025, 04:41 PM
IANS Year Ender 2025: Key Supreme Court judgments of 2025 Wed, Dec 31, 2025, 04:40 PM
Assam saw significant improvement in crime detection, convictions in 2025: Top cop Wed, Dec 31, 2025, 04:34 PM