|
|
by Suryaa Desk | Sat, May 17, 2025, 10:14 AM
కూటమి ప్రభుత్వం,గత ప్రభుత్వం మీద కోపంతో కావాలని రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో భాగంగా కొంతమంది ఐఏఎస్ ,ఐపీఎస్ మరియు ఇతర అధికారుల మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టడం అమానుషం అని వైసీపీ నేత నలమారు చంద్ర శేఖర్ రెడ్డి అన్నారు.అయన మాట్లాడుతూ...... గత ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో కార్యదర్శి గా పని చేసి పదవీవిరమణ పొందిన మాజీ ఐఏఎస్ అధికారి కె.ధనంజయ రెడ్డి గారికి మరియు ఓఎస్డీ గా పనిచేసిన మాజీ రెవిన్యూ అధికారి కృష్ణమోహన్ రెడ్డి గారికి లిక్కర్ కేసుతో ఎలాంటి సంబంధం లేనప్పటికీ వారి మీద అకారణంగా కేసులుపెట్టి వారిని అరెస్టు చేయడం అన్యాయం. ఇలాగైతే ప్రభుత్వంలో అధికారులెవ్వరూ పని చెయ్యరు. ఇలా చేస్తే ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం మీద తిరగబడే రోజు త్వరలోనే వస్తుంది. ఇలా అధికారుల మీద అనవసరంగా కేసులు పెట్టి అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అని అన్నారు.
Latest News