భయపెట్టిస్తున్న బాబా వంగా జోస్యం
 

by Suryaa Desk | Fri, May 16, 2025, 11:43 PM

సాంకేతికత.. ఇది రెండు వైపుల పదునున్న కత్తి వంటిది. టెక్నాలజీ వల్ల జీవితాలు మారుతాయన్నది ఎంత నిజమో, అది మనిషి నుంచి మనిషిని దూరం చేస్తుంది అనేది కూడా అంతే నిజం. కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడం అత్యవసరం, అలాగే దానికి అలవాటు పడకుండా, దానికి బానిసలై పోకుండా మనల్ని మనం నియంత్రించుకోవడం కూడా అంతే అవసరం. లేకపోతే మానసికంగా, శారీరకంగా సాంకేతికత విపరీతమైన ప్రభావాలను చూపిస్తుంది. దీనిపై ఏనాడో బాబా వంగా చెప్పింది ఇప్పుడు నిజం అవుతోంది.


బల్గేరియాకు చెందిన బాబా వంగా గురించి చాలా మంది చాలా సమయాల్లో వినే ఉంటారు. ఆమె చెప్పిన ఎన్నో జోస్యాలు నిజం అయ్యాయి. చిన్న వయస్సులోనే చూపు కోల్పోయిన బాబా వంగా ప్రకృతి విలయాలు, ప్రపంచ యుద్ధాలు, విపత్తుల గురించి జోస్యం చెప్పారు. అందులో చాలా వరకు నిజం అయ్యాయి కూడా. కరోనా మహమ్మారిని కూడా బాబా వంగా ముందే ఊహించారు. అలాగే ఆమె చెప్పిన గ్యాడ్జెట్ ప్రిడిక్షన్ కూడా ఇప్పుడు నిజం అవుతోంది. అదే మొబైల్.


ఒక సాంకేతిక పరికరానికి మనుషులు బానిసలు అవుతారని బాబా వంగా అంచనా వేశారు. ఇప్పుడు మొబైల్‌కు చాలా మంది బానిసలుగా మారుతున్నారు. చిన్న పిల్లల నుంచి పండు ముసళ్ల వరకు ఇప్పుడు చాలా మంది ఫోన్లకు అతుక్కుపోతున్నారు. ఉదయం లేచింది మొదలు మళ్లీ రాత్రి నిద్రించే వరకు, కొందరైతే నిద్రను మానుకుని మరీ మొబైల్‌ను తెగ వాడేస్తున్నారు. అలా మొబైల్ చూసే సమయం ఎప్పుడో మితిమీరిపోయింది. దీని వల్ల నిద్రలేమి, మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు, మతిమరుపు సమస్యలకు కూడా గురవుతున్నారు.


దేశంలో నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ నివేదిక ప్రకారం 24 శాతం మంది పిల్లలు పుడుకునే ముందు మొబైల్ చూస్తున్నారు. ఈ అలవాటు వల్ల చిన్నారుల్లో నిద్రలేమి సమస్య తీవ్రమవుతోంది. ఇది కాస్తా ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తోంది. దీని వల్ల పిల్లల ఎదుగుదల కూడా ప్రభావితం అవుతోంది. పెరుగుదలకు ఆటంకం ఏర్పడుతోంది. అన్నింటిపై శ్రద్ధ తగ్గుతోందని, ఒంటరితనానికి దారితీస్తోందని నిపుణులు అంటున్నారు.


పిల్లలే కాకుండా పెద్దలపైనా మొబైల్ ప్రభావం అధికంగా ఉంటున్నట్లు అధ్యయనాల్లో తేలింది. చాలా మంది ఉదయం లేవగానే ఫోన్ చూస్తుంటారు. బ్రెష్ చేసుకుంటూ, స్నానం అయ్యాక టవల్‌తో తుడుచుకుంటూ, టిఫిన్ తినుకుంటూ, కుటుంబసభ్యులతో మాట్లాడుతూ, పిల్లలతో ఆడుకుంటూ, డ్రైవ్ చేసుకుంటూ, మళ్లీ నిద్రపోయే సమయంలో కూడా ఫోన్ చూస్తూనే ఉంటారు చాలా మంది. దీని వల్ల మెదడుపై తీవ్రమైన ప్రభావం పడుతున్నట్లు అధ్యయనాల్లో తేలింది. సోషల్ మీడియాను అతిగా వినియోగించడం వల్ల మానసిక ఒత్తిడి, ఒంటరితనం పెరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వ్యక్తిగత సంబంధాలు కూడా బలహీనపడుతున్నట్లు తేలింది.

Latest News
How Pakistan govt is letting down its people Sun, Dec 28, 2025, 04:16 PM
Fake Gandhi-led Congress is weakest link of powerful democracy, says BJP Sun, Dec 28, 2025, 04:12 PM
Australian police arrest man following fatal stabbing in Sydney Sun, Dec 28, 2025, 03:47 PM
Tata Group pays tribute to Ratan Tata on his 88th birth anniversary Sun, Dec 28, 2025, 03:42 PM
Experts predict US dollar-won at 1,420 level on annual average Sun, Dec 28, 2025, 03:38 PM