నిరుద్యోగంపై తొలిసారి నెలవారీ గణాంకాలు
 

by Suryaa Desk | Fri, May 16, 2025, 08:11 PM

దేశంలో ఇప్పటి వరకూ త్రైమాసిక, వార్షిక వారీగా నిరుద్యోగ గణాంకాలను కేంద్రం విడుదల చేస్తోంది. అయితే, తొలిసారిగా నెలవారీ నిరుద్యోగ రేటు గణాంకాలను గురువారం వెల్లడించింది. కేంద్ర గణాంక, పథకాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ‘పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే  ప్రకారం. ఈ ఏడాది ఏప్రిల్‌లో నిరుద్యోగ రేటు 5.1 శాతంగా నమోదైంది. దేశంలోని ఉద్యోగాలకు అర్హత కలిగిన 15 ఏళ్లు దాటిన వ్యక్తుల్లో, నిరుద్యోగులు ఎంత మంది ఉన్నారనేది సత్వరం తెలియజేయడమే ఈ నివేదిక ముఖ్య ఉద్దేశం కరెంట్‌ వీక్లీ స్టేటస్‌  విధానంలో సేకరించిన తాజా గణాంకాల ప్రకారం.. దేశంలో 15 ఏళ్లు పైబడినవారిలో నిరుద్యోగిత రేటు 2025 ఏప్రిల్‌లో ‘5.1%’గా నమోదైంది.


గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణాల్లో నిరుద్యోగిత ఎక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 4.5% ఉండగా, పట్టణ కేంద్రాల్లో 6.5%గా నమోదయ్యింది. ఈ ఏడాది జనవరి నుంచి పీఎల్ఎఫ్ఎస్ పునరుద్ధరించారు. ఇప్పుడు మొదటిసారి నెలవారీ బులెటిన్ రూపంలో ఉద్యోగ గణాంకాలను విడుదల చేస్తోంది. ఈ గణాంకాల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాలపై వేర్వేరు వివరాలను పొందుపరిచారు. 15 సంవత్సరాలు పైబడిన పురుషుల్లో నిరుద్యోగిత రేటు 5.2%గా ఉంటే.. అమ్మాయిల్లో అది 5.0%గా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో పురుషులు 4.9%, మహిళలు 3.9% అయితే.. పట్టణ ప్రాంతాల్లో మహిళలు 8.7%, పురుషులు 5.8%గా ఉన్నారు. కాగా, దేశంలో యువత ఉద్యోగాల కోసం కంపెనీల చుట్టూ తిరుగుతోన్న ఘటనలు తరుచూ సోషల్ మీడియాలో వెలుగుచూస్తున్నాయి.. ఓ కంపెనీలో 10 ఉద్యోగాలకు వందల మంది హాజరైన ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది.


యువతలో నిరుద్యోగిత రేటు (15–29 ఏళ్లు)


దేశవ్యాప్తంగా యువ నిరుద్యోగులు 13.8% ఉన్నట్టు గణాంకాలు పేర్కొన్నాయి. విడిగా చూస్తే పట్టణాల్లో 23.7%.. గ్రామీణ ప్రాంతాల్లో 10.2 శాతంగా ఉంది.. గ్రామీణ మహిళలు 14.4%, పురుషులు 13.6%.


15 ఏళ్లు, ఆపై వయసున్నవారిలో కార్మిక శక్తి భాగస్వామ్య రేటు (ఎల్ఎఫ్పీఆర్) ఏప్రిల్‌లో 55.6 శాతంగా నమోదైంది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో 58%, పట్టణాల్లో 50.7 శాతంగా కనిపించింది. వీరిలో గ్రామీణ పురుషులు 79.0%, పట్టణాల్లో పురుషులు 75.3%


మొదటి దశలో 7,500 ప్రాంతాలను నమూనాగా తీసుకుని.. 89,434 నివాసాల్లో సర్వే నిర్వహించారు. వీటిలో గ్రామీణ ప్రాంతాల్లో 49,323.. పట్టణ ప్రాంతాల్లో 40,111 మొత్తం 3,80,838 మందిని సర్వే (గ్రామీణులు 2,17,483.. పట్టణాలు 1,63,355) చేశారు.

Latest News
Path shown by Guru Gobind Singh for human welfare, courage and truth will always inspire us: Congress Sat, Dec 27, 2025, 11:18 AM
'Have taken four wickets whenever I've played here', says Renuka after match-winning spell vs SL Sat, Dec 27, 2025, 11:11 AM
Mouse births pups after returning from space mission in China, paving way for future research Sat, Dec 27, 2025, 11:10 AM
PNB declares Rs 2,434 crore alleged loan fraud against former promoters of Srei firms Sat, Dec 27, 2025, 11:05 AM
Trump to meet Zelensky tomorrow amid push for Ukraine peace deal Sat, Dec 27, 2025, 11:03 AM