|
|
by Suryaa Desk | Fri, May 16, 2025, 05:09 PM
ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలు వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే పలు డిపార్ట్‌మెంట్ పరీక్షలు వాయిదా పడగా, తాజాగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) మరో కీలక ప్రకటన చేసింది.
ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కళాశాలలు, టీటీడీ డిగ్రీ కళాశాలల లెక్చరర్ పోస్టులకు సంబంధించి నిర్వహించాల్సిన పరీక్షలను వాయిదా వేసినట్లు కమిషన్ వెల్లడించింది. ఈ పరీక్షలు 2025 జూన్ 16 నుండి 26వ తేదీ వరకు జరగాల్సి ఉంది.
అయితే, అడ్మినిస్ట్రేటివ్ కారణాల వల్ల ఈ పరీక్షలు వాయిదా వేయబడ్డాయని అధికారులు వెల్లడించారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన కొత్త తేదీలను త్వరలోనే ప్రకటించనున్నట్టు తెలియజేశారు. ఈ నేపథ్యంలో పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను (https://psc.ap.gov.in) పర్యవేక్షిస్తూ ఉండాలని సూచిస్తున్నారు.