|
|
by Suryaa Desk | Fri, May 16, 2025, 04:27 PM
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శ్రీవారి భక్తులకు తీపి కబురు అందించింది. ఈ నెల 19వ తేదీన ఆగస్టు నెల కోటా ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేయనున్నట్లు TTD ప్రకటించింది. ఈ టికెట్లు ఉదయం 10 గంటల నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. ఆసక్తి గల భక్తులు 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.
అలాగే, మే 29వ తేదీ ఉదయం 10 గంటలకు జూలై నెలకు సంబంధించిన శ్రీవారి సేవ, పరకామణి సేవ, నవనీత సేవ కోటా టికెట్లను కూడా విడుదల చేయనున్నట్లు TTD తెలిపింది. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.