|
|
by Suryaa Desk | Fri, May 16, 2025, 03:52 PM
భారత స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 200.15 పాయింట్లు నష్టపోయి 83,330.59 వద్ద, నిఫ్టీ 42.30 పాయింట్లు క్షీణించి 25,019.80 వద్ద ఉన్నాయి. నిఫ్టీలో భారత్ ఎలక్ట్రానిక్స్, బజాజ్ ఆటో, అదానీ ఎంటర్‌ప్రైజెస్, టాటా కన్జ్యూమర్, ఎటర్నల్ లాభాలను ఆర్జించగా, భారతీ ఎయిర్‌టెల్, JSW స్టీల్, ఇన్ఫోసిస్, SBI, HCL టెక్నాలజీస్ నష్టపోయాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 85.51గా ఉంది.బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 64.51 డాలర్లు సెన్సెక్స్‌లో ఉన్న 30 ప్రధాన షేర్లలో భారతీ ఎయిర్‌టెల్, ఎస్‌బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, సన్‌ఫార్మా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, మహీంద్రా అండ్ మహీంద్రా, టీసీఎస్, టైటాన్, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.ఇదే సమయంలో బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎటర్నల్, ఎన్టీపీసీ, మారుతీ సుజుకీ, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్ షేర్లు లాభాలతో కదలాడుతున్నాయి.రూపాయి విలువ అమెరికన్ డాలర్‌తో పోల్చితే 85.42 వద్ద ట్రేడింగ్‌ను మొదలుపెట్టింది.అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 64.51 డాలర్ల వద్ద కొనసాగుతోంది. బంగారం ధర ఔన్సుకు 3,213 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
Latest News