|
|
by Suryaa Desk | Fri, May 16, 2025, 02:47 PM
శ్రీవారికి భారీ విరాళం ఇచ్చిన ఐపీఎల్లో లక్నో జట్టు ఓనర్. తిరుమల శ్రీవారికి భక్తులు తమకు తోచినంత విరాళాలు అందిస్తుంటారు. ఈ క్రమంలో తిరుమల శ్రీవారికి ఐదు కోట్ల విలువైన బంగారు ఆభరణాలు సమర్పించారు పారిశ్రామికవేత్త సంజీవ్ గోయెంకా.కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి ఐపీఎల్ టీమ్ లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్, ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్‌పీజీ గ్రూప్ చైర్మన్ సంజీవ్ గోయింక శ్రీవారికి ఐదు కోట్ల రూపాయల విలువగల ఐదు కేజీల బంగారు ఆభరణాలను విరాళంగా సమర్పించారు.ఈ ఆభరణాలలో శ్రీవారి కటి హస్తం (నడుము భాగం అలంకరించే ఆభరణం), వరద హస్తం (దయచూపే భుజానికి సంబంధించిన ఆభరణం) ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శుక్రవారం (మే 15న) ఉదయం ఆయన తిరుమల శ్రీవారి ఆలయాన్ని లక్నో టీం ఓనర్ దర్శించుకుని, ఆలయ అధికారులకు ఈ విలువైన బంగారు ఆభరణాలను అందజేశారు.ఈ సందర్భంగా ఆలయ అధికారులు సంజీవ్ గోయింకకు ప్రత్యేక సత్కారం అందించారు. విరాళం స్వీకరించిన అనంతరం టీటీడీ అధికారులు ఆయనకు శ్రీవారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.ఆలయ అధికారులకు సంజీవ్ గోయెంక వీటిని అందజేశారు.
Latest News