|
|
by Suryaa Desk | Fri, May 16, 2025, 12:41 PM
దేశంలో నైరుతి రుతుపవనాల ప్రవేశానికి సన్నాహాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో అండమాన్ నికోబర్ దీవుల్లో రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం ఆగ్నేయ అరేబియా సముద్రం, దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ ప్రాంతాల వరకు ఈ రుతుపవనాలు విస్తరించాయి.
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, వచ్చే నెల ప్రారంభంలోనే నైరుతి రుతుపవనాలు దేశానికి ప్రవేశించనున్నాయి. జూన్ 5 నాటికి ఇవి రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లోకి ప్రవేశించి, జూన్ 10 నాటికి ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కవర్ చేసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో రాష్ట్రంలో వర్షాకాలం అధికారికంగా మొదలయ్యే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. రుతుపవనాల ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో వ్యవసాయదారులు, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.