గాజాపై ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం.. 24 గంటల్లో 62 మంది మృతి
 

by Suryaa Desk | Thu, May 15, 2025, 03:28 PM

గాజాపై ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం.. 24 గంటల్లో 62 మంది మృతి

గాజా పట్టణంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు మరింత తీవ్రతరం అయ్యాయి. దీంతో గడిచిన 24 గంటల వ్యవధిలో కనీసం 62 మంది పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయారు అని గాజా ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. మృతుల్లో చిన్న పిల్లలు కూడా ఉన్నట్టు అధికారికంగా తెలిపారు.
దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ ప్రాంతంలోని పునరావాస కేంద్రాలపై జరిపిన దాడుల్లో ఐదుగురు శరణార్థులు మృతి చెందినట్లు వెల్లడించారు. ఈ దాడులు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నాయని హమాస్ తీవ్ర విమర్శలు గుప్పించింది.
అంతర్జాతీయ సమాజం తక్షణం జోక్యం చేసుకుని ఇజ్రాయెల్ దాడులను ఆపాలని, కాల్పుల విరమణను అమలు చేయాలని హమాస్ పిలుపునిచ్చింది. ప్రస్తుతం గాజాలో పరిస్థితి అత్యంత విషమంగా మారిందని, సాధారణ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని ప్రత్యక్ష సాక్ష్యాలు చెబుతున్నాయి.

Latest News
LoP Gandhi, Kharge vow to fight for tribals' rights Sat, Aug 09, 2025, 01:54 PM
Shooting on US campus leaves one dead, one injured Sat, Aug 09, 2025, 01:46 PM
Downed 6 Pak aircraft and struck 9 terror camps during Op Sindoor, says Air Force chief Sat, Aug 09, 2025, 01:44 PM
We are not going to occupy Gaza: Israeli PM Netanyahu Sat, Aug 09, 2025, 01:42 PM
WHO declares Kenya free of sleeping sickness Sat, Aug 09, 2025, 01:40 PM