|
|
by Suryaa Desk | Thu, May 15, 2025, 11:36 AM
రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని 'అన్నదాత సుఖీభవ' పథకాన్ని జూన్ 12వ తేదీ నుంచి ప్రారంభించనుంది. ఈ పథకం ద్వారా ఏపీకి చెందిన అర్హులైన రైతులకు సంవత్సరానికి రూ.20,000 ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ పథకం కింద పంటల సాగు చేసేవారికి ప్రోత్సాహకంగా నగదు మద్దతు అందించటం లక్ష్యంగా పెట్టుకున్నారు.
అర్హతలు:
అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారై ఉండాలి.
వయసు కనీసం 18 సంవత్సరాలు ఉండాలి.
లబ్ధిదారుడు రైతు లేదా కౌలురైతు అయి ఉండాలి.
అవసరమైన డాక్యుమెంట్లు:
భూమి యాజమాన్య పత్రాలు లేదా పట్టాదారు పాసుపుస్తకం
(రైతుల భూమి మాలికత్వాన్ని నిరూపించేందుకు)
ఆధార్ కార్డు
(రైతు పేరు ఆధార్‌తో అనుసంధానించాలి)
బ్యాంక్ ఖాతా వివరాలు
(ఆధార్‌తో లింక్ అయిన బ్యాంక్ ఖాతా తప్పనిసరి)
కౌలు రైతుల కోసం:
కౌలురైతు ధ్రువీకరణ పత్రం తప్పనిసరి
ఈ పథకం ద్వారా రైతులకు స్థిరమైన ఆదాయం కల్పించి, వ్యవసాయం పై మరింత ఆసక్తిని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యత్నిస్తోంది. నేరుగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తోంది. రైతులు తమ డాక్యుమెంట్లను ముందుగా సిద్ధం చేసుకుని, పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధంగా ఉండాలి.