|
|
by Suryaa Desk | Wed, May 14, 2025, 07:41 PM
జనసేన పార్టీ కార్యకర్తకు కష్టం వస్తే.. టీడీపీ ఎమ్మెల్యే అండగా నిలబడ్డారు.. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి మరీ సాయం కోరారు. స్వయంగా ఎమ్మెల్యే వచ్చి రిక్వెస్ట్ చేయడంతో సీఎం కూడా వెంటనే సాయం అందించారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త రమేష్ భార్య అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె వైద్యం కోసం చాలా డబ్బులు ఖర్చు చేశారు.. అయితే వైద్యులు ఆమెకు కిడ్నీ మార్చిడి చేయాలని సూచించారు. ఆర్థిక ఇబ్బందులతో వారికి ఆ సర్జరీ భారంగా మారింది. వెంటనే స్థానిక జనసేన పార్టీ నేతలు ఈ విషయాన్ని గోపాలపురం టీడీపీ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందించారు.. ఆ కుటుంబానికి అండగా నిలిచారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి సాయం అందేలా చూశారు.
గోపాలపురం నియోజకవర్గానికి చెందిన ఒక సామాన్యమైన పేద కుటుంబానికి చెందిన ఉన్నమట్ల రమేష్‌కు జనసేన పార్టీపై అభిమానం. గత ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం పనిచేశారు. అయితే కొంతకాలంగా రమేష్ భార్యకు కిడ్నీ సమస్య వలన.. వైద్యులు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయాలని సూచించారు. రెక్కాడితే గానీ, డొక్కాడని కుటుంబం ఆపరేషన్ కు అన్ని లక్షలు వెచ్చించి వైద్యం చేయించుకోలేని పరిస్థితి. ఈ విషయాన్ని కుటుంబసభ్యులు, జనసేన నేతలు, కార్యకర్తలు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు గారి దృష్టికి తీసుకువెళ్లి ఆదుకోవాలని కోరారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి సహాయనిధి నుండి సహాయం అందేలా చూస్తానన్నారు. వీరు LOCకి అప్లై చేసుకోగా రూ.2,00,000 లక్షలు మంజూరు చేశారు. కానీ రమేష్ భార్య ఆపరేషన్‌కు ఆ డబ్బులు సరిపోలేదు.
ఆ వెంటనే ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు స్వయంగా సీఎంఆర్ఎఫ్ అధికారులతో మాట్లాడగా.. వారు రూ. 3,60,000 మంజూరు చఏశారు. కానీ నిరుపేద కుటుంబం ఇప్పటికే వైద్య ఖర్చుల నిమిత్తం అంత అయ్యిపోయింది ఆర్థికంగా చితికిపోయారు. తమ దగ్గర ఆపరేషన్‌కు సరిపడా డబ్బులు లేవని.. మళ్లీ ఎమ్మెల్యేను కలిసి సాయం కోరారు. ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు జనసేన పార్టీ కార్యకర్త రమేష్ కుటుంబానికి అండగా నిలిచి.. ఆయనే స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి రూ. 6,30,000/- లక్షలు చెక్కును మంజూరు చేయించి.. ఇంకా ఆపరేషన్ కి అవసరమైతే సొంత డబ్బును కూడా ఇస్తా అని హామీ ఇచ్చారు. మద్దిపాటు వెంకట రాజు చేసిన సాయం గురించి టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో వైరల్ అవుతోంది. గోపాలపురం ఎమ్మెల్యే పెద్ద మనసును అందరూ అభినందిస్తున్నారు.
Latest News