ఐసీసీ టెస్ట్ ఆల్‌రౌండ‌ర్ ర్యాంకింగ్స్ లో తొలి స్థానాన్ని ప‌దిలం చేసుకున్న జ‌డ్డూ
 

by Suryaa Desk | Wed, May 14, 2025, 06:46 PM

భార‌త జ‌ట్టు స్టార్ క్రికెట‌ర్ ర‌వీంద్ర జ‌డేజా టెస్ట్ క్రికెట్‌లో అరుదైన ఘ‌నత సాధించాడు. తాజాగా ఐసీసీ విడుద‌ల చేసిన టెస్ట్ ఆల్‌రౌండ‌ర్ ర్యాంకింగ్స్ లో తొలి స్థానాన్ని ప‌దిలం చేసుకున్నాడు. అదే స‌మ‌యంలో సుదీర్ఘ కాలం పాటు అగ్ర‌స్థానంలో కొన‌సాగుతున్న ఆట‌గాడిగా రికార్డుకెక్కాడు. 1,151 రోజులుగా జ‌డ్డూ ఈ స్థానంలో కొన‌సాగుతున్నాడు.ఇక‌, తాజా ఐసీసీ టెస్ట్ ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్‌లో ర‌వీంద్ర‌ జడేజా 400 పాయింట్లు త‌ర్వాత రెండో స్థానంలో బంగ్లాదేశ్‌కు చెందిన‌ మెహదీ హసన్ మీరాజ్ 327 పాయింట్లు ఉంటే ద‌క్షిణాఫ్రికా ఆట‌గాడు మార్కో యన్సెన్ 294 పాయింట్లు మూడో ర్యాంక్‌లో ఉన్నాడు. అలాగే ఆస్ట్రేలియాకు చెందిన పాట్ కమ్మిన్స్, బంగ్లాకు చెందిన షకీబ్ అల్ హసన్ టాప్-5 జాబితాలో ఉన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, టాప్ 10లో ఉన్న ఏకైక భారత ఆల్ రౌండర్ జడేజానే.

Latest News
2025 a year of evidence-based growth, global leadership for Ayush sector Fri, Dec 26, 2025, 12:59 PM
VHT: Kohli makes 77 against Gujarat; Rohit suffers golden duck vs Uttarakhand Fri, Dec 26, 2025, 12:55 PM
Revised rail fares to balance affordability, ensure sustainability come into effect Fri, Dec 26, 2025, 12:53 PM
Housing sales value in Indian cities jump 6 pc in 2025: Report Fri, Dec 26, 2025, 12:45 PM
SP's Afzal Ansari criticises UP minister over Sengar bail remarks Fri, Dec 26, 2025, 12:39 PM