|
|
by Suryaa Desk | Wed, May 14, 2025, 03:23 PM
అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. హుకుంపేట మండలం టిటింగి వలస వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మోద కొండమ్మ జాతరకు వెళ్లిన అనంతరం తిరిగి వస్తున్న సమయంలో బైక్‌పై వస్తున్న యువకులు ఆటోను ఢీకొట్టారు. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
ప్రమాదంలో మరికొంతమంది గాయాల పాలయ్యారు. ప్రమాద స్థలానికి చేరుకున్న స్థానికులు, పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదానికి గల కారణాలు తెలిసేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో జాతరకు వెళ్లిన ప్రాంత ప్రజల్లో విషాదచాయలు నెలకొన్నాయి.