|
|
by Suryaa Desk | Sat, Mar 16, 2024, 11:19 PM
ఎన్నికల కోడ్ రావడంతో జగన్ ప్రభుత్వం అస్తమించబోతుందని పామర్రు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వర్ల కుమార్ రాజా అన్నారు. శనివారం నాడు పామర్రు ఎన్టీఆర్ సర్కిల్లో కూటమి అభ్యర్థి వర్ల కుమార్ రాజా ఆధ్వర్యంలో "జగన్ నియంత పాలనకు చరమగీతం " అనే కార్యక్రమానికి పిలుపునిచ్చారు. భారీగా టీడీపీ - జనసేన పార్టీల శ్రేణులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం తిరిగి వచ్చిందని హర్షం వ్యక్తం చేస్తూ టపాసులు కాలుస్తూ, మిఠాయిలు తినిపించుకున్నారు. ఎన్నికల కోడ్ రావడంతో పామర్రు నియోజకవర్గంలో సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వర్ల కుమార్ రాజా మాట్లాడుతూ.. నేడు ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో శుభదినమని చెప్పారు. ప్రజాస్వామ్యం మళ్లీ పురుడు పోసుకోబోతుందన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు మళ్లీ అదుపులోకి రానున్నాయని తెలిపారు. ప్రజలు స్వేచ్ఛగా జీవించడానికి ఇంకా 56 రోజులే ఉన్నాయని ప్రజల సంతోషంగా పండగ చేసుకుంటున్నారని వర్ల కుమార్ రాజా పేర్కొన్నారు.
Latest News