|
|
by Suryaa Desk | Sat, Mar 16, 2024, 11:16 PM
అనపర్తిలో టీడీపీ కార్యకర్తలు అత్యవసరంగా సమావేశం అయ్యారు. అనపర్తి నియోజక వర్గం ఉమ్మడి అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడం సరికాదని టీడీపీ కార్యకర్తలు అంటున్నారు. ఈ క్రమంలో అనపర్తి నుంచి రామవరంలోని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటివరకు కార్యకర్తలు ర్యాలీ తీశారు. దీంతో కార్యకర్తలు ఆందోళన చెందవద్దని, సీటు మనదే.. విజయం మనదే అంటూ రామకృష్ణారెడ్డి వారికి భరోసా ఇచ్చారు. టీడీపీని ఎదుర్కొలేక వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని ఆయన అన్నారు.
Latest News