ఏపీ, తెలంగాణ మధ్య పూర్తైన ఏపీ భవన్ విభజన.. ఎవరెవరికి ఎన్ని ఎకరాలంటే
 

by Suryaa Desk | Sat, Mar 16, 2024, 10:11 PM

ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన సమస్య ఎట్టకేలకు తీరింది. ఉమ్మడి అంధ్రప్రదేశ్ విభజన జరిగిన పదేళ్ల తర్వాత ఢిల్లీలోని ఏపీ భవన్ ఆస్తుల విభజన పూర్తైంది. ఏపీ భవన్ విభజనకు ఈ మేరకు కేంద్రం ఆమోదం తెలిపింది. కేంద్ర హోంశాఖ నుంచి కూడా ఉత్తర్వులు జారీ అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనకు ఏపీ సర్కారు అంగీకరించడంతో ఎట్టకేలకు ఏపీ భవన్ ఆస్తుల విభజన ప్రక్రియ పూర్తైంది.


ఢిల్లీలోని అశోకా రోడ్డు, మాధవరావు సింధియా మార్గ్‌లలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు19.733 ఎకరాల భూమి ఉంది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు 11.536 ఎకరాలు. తెలంగాణకు 8.245 ఎకరాలు కేటాయించారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గోదావరి, స్వర్ణముఖి బ్లాక్‌లను కేటాయించారు. ఈ రెండూ కలిపి 5.781 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. అలాగే నర్సింగ్ హాస్టల్‌లో ఆంధ్రప్రదేశ్ వాటాగా 3. 359 ఎకరాలు, పటౌడి హౌస్‌లో 2.396 ఎకరాలను కేంద్ర హోంశాఖ కేటాయించింది.


ఇక తెలంగాణకు సంబంధించి శబరి బ్లాక్‌లో మూడు ఎకరాలు. పటౌడి హౌస్‌లో 5.245 ఎకరాలను కేటాయించారు. ఈ ప్రతిపాదనలకు రెండు రాష్ట్రాలు అంగీకారం తెలపడంతో.. కేంద్రం ఆమోదం తెలిపింది. అనంతరం కేంద్ర హోంశాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. విభజన చట్టం ప్రకారం ఇరు రాష్ట్రాలు ఆప్షన్ జీని అంగీకరించడంతో ఏపీ భవన్ ఆస్తుల విభజన ప్రక్రియ ముగించినట్లు కేంద్ర హోంశాఖ ఉప కార్యదర్శి లలిత్ కపూర్ తెలిపారు.

Latest News
In a first for Bengal politics, winning side facing violence Thu, May 07, 2026, 04:11 PM
Jyoti Baba Gang member wanted in murder case arrested in Delhi Thu, May 07, 2026, 04:10 PM
Labour reforms: Centre launches free annual health check-ups for workers aged 40 and above Thu, May 07, 2026, 03:59 PM
Cracks in Kerala CPI-M, Jayarajan steps in as dissent grows against Vijayan Thu, May 07, 2026, 03:51 PM
Govt launches JANANI platform to strengthen maternal, child healthcare Thu, May 07, 2026, 03:47 PM