|
|
by Suryaa Desk | Fri, Mar 15, 2024, 06:23 PM
సీఎం వైఎస్ జగన్ శనివారం ప్రకటించే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో తన పేరు ఉంటుందనే నమ్మకం తనకు ఉన్నట్లు చీరాల వైసీపీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం చీరాల క్యాంప్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ పార్టీ కార్యక్రమాలన్నీ తాను ప్రజల్లోకి తీసుకెళ్లానని అన్నారు. గడప గడపకు కార్యక్రమాన్ని నియోజకవర్గంలో విజయవంతంగా నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
Latest News