|
|
by Suryaa Desk | Fri, Mar 15, 2024, 01:14 PM
రాజమహేంద్రవరం లోక్‌సభ స్థానం పరిధిలో టీడీపీ దళిత నేత, మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అంశం ఆసక్తికరంగా మారింది. ఆయన గతంలో గోపాలపురం(ఎస్సీ) ఎమ్మెల్యేగా చేశారు. ఆ నియోజకవర్గంలో ఒక వర్గం ఈసారి కూడా ఆయనకే టికెట్ ఇవ్వాలని కోరింది. అదే లోక్‌సభ స్థానం పరిధిలోని కొవ్వూరు (ఎస్సీ) నియోజకవర్గ టీడీపీ నేతలు సైతం అనూహ్యంగా ఆయన్ను తమ స్థానంలో నిలబెట్టాలని అధిష్ఠానాన్ని కోరడం విశేషం. ఒక దళిత నేత కోసం రెండు నియోజకవర్గాల నుంచి అభ్యర్థనలు రావడం అరుదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. చివరకు ముప్పిడిని కొవ్వూరు అభ్యర్థిగా ఎంపిక చేశారు.
Latest News