|
|
by Suryaa Desk | Fri, Mar 15, 2024, 01:10 PM
చిత్తూరులోని మూడు కేంద్రాల్లో ఈ నెల 17న ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ షన్మోహన్ తెలిపారు. పరీక్షలు హాజరయ్యే 2,518 మంది అభ్యర్థులు ఎస్వీ సెట్ (ఆర్వీఎస్ నగర్),
సీటమ్స్ కాలేజ్ (మురకంబట్టు), పీవీకేఎన్ ప్రభుత్వ కళాశాల (చిత్తూరు)లను పరీక్షా కేంద్రాలుగా గుర్తించామన్నారు. 17న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2 నుంచి సా.4 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరుగుతాయన్నారు.