మామ అల్లుళ్ళ మధ్య ఫైట్, ఆసక్తికరంగా పెదకూరపాడు
 

by Suryaa Desk | Fri, Mar 15, 2024, 01:02 PM

పల్నాడు జిల్లాలోని పెదకూరపాడు నియోజకవర్గంలో టీడీపీ - వైసీపీ  మధ్య వార్ తారాస్థాయికి చేరుకుంది. గత రాత్రి అనంతవరం, దోడ్లేరు గ్రామాల్లో పెదకూరపాడు టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్‌కు  చెందిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించేశారు. అయితే ఉదయం తొమ్మిది గంటల సమయంలో అమరావతి మండలం ధరణికోటలో వైసీపీ కార్యాలయానికి కొందరు వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ వ్యవహారంపై వైసీపీకి చెందిన బండ్లమూడి పూర్ణచంద్రరావు  పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో టీడీపీకి చెందిన ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాలుగు రోజుల క్రితమే వైసీపీ ఆఫీస్‌ను ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, ఎంపీ అభ్యర్ది అనిల్ కుమార్ యాదవ్ ప్రారంభించారు. అయితే ఇంతలోని ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో పెదకూరపాడు నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పెదకూరపాడులో మామ అల్లుళ్ళ మధ్య ఫైట్ ఆసక్తికరంగా మారింది.

Latest News
Late Bellerin goal all but ends Real Madrid's La Liga title hopes Sat, Apr 25, 2026, 10:29 AM
Bangladesh faces deepening debt crisis Fri, Apr 24, 2026, 04:37 PM
Road to 2027 World Cup: Samson's red-hot form puts Pant's ODI spot under serious threat Fri, Apr 24, 2026, 04:36 PM
Panchayati Raj institutions a gift of Rajiv Gandhi: Congress Fri, Apr 24, 2026, 04:08 PM
TVK chief Vijay says voters crush 'political myths' with record 85 pc turnout in TN Fri, Apr 24, 2026, 04:02 PM