|
|
by Suryaa Desk | Thu, Mar 14, 2024, 01:57 PM
అసభ్యకర కంటెంట్ అందిస్తున్న పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై కేంద్రం చర్యలు తీసుకుంది. అశ్లీలమైన, అసభ్యకరమైన కంటెంట్‌ను ప్రచురించే 18 OTT ప్లాట్‌ఫామ్‌లను మార్చి 12 తొలగించినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు.
అలాగే 19 వెబ్‌సైట్‌లు, 10 యాప్‌లను తొలగించినట్టు పేర్కొన్నారు. ఈ ప్లాట్‌ఫామ్‌లతో లింకైన 57 సోషల్ మీడియా ఖాతాలను నిలిపివేసినట్టు చెప్పారు.