మెప్పుకోసం మోదీకి అబద్దం చెప్పిన బీజేపీ నేత పరార్!
 

by Suryaa Desk | Wed, Mar 13, 2024, 09:49 PM

గత నెలలో ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు పర్యటనకు వెళ్లినప్పుడు ఆయనకు స్వాగతం పలకడానికి బీజేపీ కార్యకర్త ఒకరు చెన్నై విమానాశ్రయానికి వచ్చాడు. ఈ సమయంలో ప్రధానితో అప్పుడే తనకు కవల పిల్లలు పుట్టారని, వారిని చూడకుండా మీకోసం వచ్చేశానని చెప్పాడు. అయితే, అతడు అబద్దం చెప్పినట్టు తాజాగా బయటపడడంతో బీజేపీ నేతలు విస్తుపోయారు. ఈ విషయం తెలిసి అతడు పరారైనట్టు తెలిసింది. మోదీని స్వాగతించేందుకు అశ్వంత్‌ పిజయ్‌ అనే బీజేపీ నిర్వాహకుడు విమానాశ్రయానికి వెళ్లాడు ఇదే విషయంపై ప్రధాని తన ఎక్స్‌ పేజీలో పోస్టు పెట్టారు.


‘కొద్దిసేపటి కిందటే అశ్వంత్‌ పిజయ్‌కు కవల పిల్లలు పుట్టారు.. వారిని ఇంకా చూడలేదు.. ఆయనా నాకోసం వచ్చాడు.. అతడు విమానాశ్రయానికి వచ్చి ఉండకూడదు.. మా పార్టీకి ఇంత అంకితభావం ఉన్న కార్యకర్తలు ఉండటం చాలా సంతోషాన్నిస్తుంది. మా కార్యకర్తల ప్రేమ, ఆప్యాయతలను చూస్తుంటే నేను భావోద్వేగానికి లోనయ్యాను.’ అని మోదీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అశ్వంత్‌ పిజయ్‌పై బీజేపీ నాయకులు ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది.


కేరళకు చెందిన అతడు విమానాశ్రయంలో పని చేస్తూ చెన్నై వేళచ్చేరిలో ఉంటున్నాడు. ప్రధాని చెప్పినట్లు అతడికి కవల పిల్లలు జన్మించలేదని, మోదీ మెప్పుపొందేందుకు అబద్ధం ఆడినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఫోన్‌ స్విచాఫ్‌ చేసి, పరారైనట్లు భోగట్టా. ఆయన్ను అరెస్టు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్‌ చేస్తున్నట్లు సమాచారం.

Latest News
Violence, mistrust derail anti-polio drive in Pakistan Sat, Apr 18, 2026, 04:09 PM
10 Kannur CPI-M workers get 25-year jail term for hurling bombs at BJP/RSS supporters Sat, Apr 18, 2026, 04:01 PM
CSK must play MS Dhoni, it will give them an extra edge against SRH: Aditya Tare Sat, Apr 18, 2026, 03:59 PM
Gujarat: Six arrested in over Rs 210-crore cyber fraud linked to 273 cases nationwide Sat, Apr 18, 2026, 03:51 PM
ECI plans 'slow polling', 'slow counting' to frustrate TMC agents: Mamata Sat, Apr 18, 2026, 03:50 PM